- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిల్లాల అభివృద్ధికి రూ.4వేల కోట్ల ప్రాజెక్టులు
దిశ, మందమర్రి : పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రూ.4వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి పై ఎంపీ పార్లమెంట్‌లో కేంద్ర

దిశ, మందమర్రి : పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన రూ.4వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతి పై ఎంపీ పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ వినతిపత్రం అందచేశారు. ఈ మేరకు ఎంపీ కార్యాలయం పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రాజెక్టుల స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అదే సమయంలో తెలంగాణకు తీసుకురావాల్సిన సెమీకండక్టర్ ఫెసిలిటీ రాజకీయ కారణాలతో ఆంధ్రప్రదేశ్‌కు తరలించడంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చి ఉంటే వేలాది యువతకు ఉద్యోగ అవకాశాలు కలిగేవని పేర్కొన్నారు. స్పష్టమైన ప్రపోజల్ ఇవ్వాలని కేంద్రం సూచించగా దానిపై అన్ని అవకాశాలు పరిశీలిస్తామని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రి అశ్విని వైష్ణవ్ ని ఎంపీ వ్యక్తిగతంగా కలిసి పెద్దపల్లి–మంచిర్యాల ప్రాంతంలో ఉన్న నీటి వనరులు, భూమి లభ్యత, నైపుణ్యం కలిగిన యువత ప్రతిభను వివరించారు. రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్, సింగరేణి సంస్థల విజయాన్ని ఉదాహరణగా చూపుతూ, ఈ ప్రాంతం పరిశ్రమలకు అత్యంత అనుకూలమని తెలిపారు. సెమీకండక్టర్ ఫెసిలిటీ ఏర్పాటు అయితే రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తుకు గణనీయమైన ప్రయోజనం ఉంటుందని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.






