- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
32 ఏళ్లుగా మోక్షం లభించని ప్లాట్ల వాస్తవం..!
నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన సౌనా, భాకోట గ్రామాల ముంపు బాధితులకు ప్రభుత్వం మూడున్నర దశాబ్దాల క్రితం నివాస

దిశ, కుబీర్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందిన సౌనా, భాకోట గ్రామాల ముంపు బాధితులకు ప్రభుత్వం మూడున్నర దశాబ్దాల క్రితం నివాస స్థలాలకోసం భూమిని కేటాయించినా, ఇప్పటికీ తాళిక దాటని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 1993లో ప్రభుత్వం ఈ రెండు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు 10 ఎకరాలు 10 గుంటల భూమిని కొనుగోలు చేసి, పట్టాలు పంపిణీ చేసినప్పటికీ, ఇప్పటికీ వారికి ప్లాట్లను కేటాయించి చూపించలేదు.
అధికారుల చుట్టూ ముట్టిన పదేళ్లు.. పరిష్కారం మాత్రం గల్లంతు
ఇది లబ్ధిదారుల పరిస్థితి. పట్టాలు తీసుకున్న 32 ఏళ్లుగా ఎన్నో సార్లు అధికారులు చుట్టూ తిరిగి, వినతిపత్రాలు సమర్పించినా వారి కలలు ఇప్పటికీ నెరవేరలేదు. సంబంధిత స్థలం ఇప్పుడు చెట్లు, ముళ్లపొదలతో కమ్ముకొని అటవీప్రాంతంగా మారింది. రోడ్డు పక్కనే ఉన్న ఈ స్థలం నాశనమవుతుండటంతో భవిష్యత్తులో అక్రమ కబ్జాలకు కూడా దారితీసే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
"దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించడు"
ప్రభుత్వం వారి కోసం స్థలాన్ని కేటాయించినా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. గ్రామస్థులు దీన్ని "దేవుడు వరమిచ్చినా, పూజారి కరుణించడు" అనే జాతీయంతో పోల్చుతూ వేదన చెందుతున్నారు. సర్వే చేసి, సరిగా ప్లాటింగ్ చేసి స్థలాన్ని చూపించాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా, ఇప్పటికీ నిస్పృహే మిగిలిందని ఆరోపిస్తున్నారు.
ఇందిరమ్మ పథకం గుండా ఇండ్ల నిర్మాణానికి సిద్ధం
ప్లాట్లు చూపిస్తే, ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటి నిర్మాణం చేసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. దీంతో సంబంధిత శాఖ అధికారులు స్పందించి, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.






