డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 19 మందికి జైలు శిక్ష..

by Kodari Anjali |

ఆదిలాబాద్ జిల్లాలో మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 19 మందికి జైలు శిక్ష..
X

దిశ, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్ జిల్లాలో మందుబాబులకు కోర్టు జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కోర్టులో హాజరుపర్చగా ఆదిలాబాద్‌ ప్రిన్సిపల్‌ జేఎఫ్‌సీఎం జడ్జి భుక్య హుస్సేన్‌ బుధవారం తీర్పునిచ్చారు. మొత్తం 19 మందిపై డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా, జడ్జి 13 మందికి మూడు రోజుల పాటు, ఆరుగురికి రెండు రోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో ప్రాణ నష్టం సంభవిస్తుందని, కుటుంబ పెద్ద కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నమవుతుందని పేర్కొన్నారు. 17 మందిపై ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌లో కేసులు నమోదు చేయగా, ఇద్దరిపై వన్‌టౌన్‌లో కేసులు నమోదైనట్లు చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story