- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఆదిలాబాద్ పట్టణాబివృద్ధికి రూ.15 కోట్ల నిధులు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
ఆదిలాబాద్ పట్టణాబివృద్ధికి రూ.15 కోట్ల నిధులు : ఎమ్మెల్యే పాయల్ శంకర్
దిశ,ఆదిలాబాద్ : పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాజాగా రూ.15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు.

X
దిశ,ఆదిలాబాద్ : పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాజాగా రూ.15 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడించారు. పట్టణంలో వివిధ 52 అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని మే 17వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లోని సచివాలయంలో శనివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఎమ్మెల్యే కు అందజేశారు. ఈ నిధులతో పలు వార్డుల్లో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బీటీ రోడ్ల నిర్మాణంతో పాటు గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నిధులను మున్సిపాలిటీ లో ప్రాథమిక సదుపాయాల అభివృద్ధి కోసం వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
Next Story






