- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పిల్లలు హతం
వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పొట్టేలు పిల్లలు చనిపోయిన ఘటన ఖానాపూర్ మండలం లోని తర్లపాడ్ గ్రామంలో చోటు చేసుకుంది.

దిశ, ఖానాపూర్ : వీధి కుక్కల దాడిలో 11 గొర్రె పొట్టేలు పిల్లలు చనిపోయిన ఘటన ఖానాపూర్ మండలం లోని తర్లపాడ్ గ్రామంలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని తర్లపాడ్ గ్రామానికి చెందిన అప్పుల రాజన్న మంగళవారం ఉదయం గొర్రెల పాకలో గొర్రెల పొట్టేలు పిల్లలను ఉంచి మిగితా గొర్రెలను మేతకు అటవీ ప్రాంతానికి తీసుకుపోయాడు. మధ్యాహ్నం మేతకు తీసుకువెల్లిన గొర్రెలను ఇంటి వద్ద ఉన్నగొర్రెల పాకాలకు తీసుకువచ్చే సరికి వీధి కుక్కలు పోయి 11 గొర్రెల పొట్టేలు పిల్లలను చంపేశాయి. మరిన్ని గొర్రెలను గాయపర్చడంతో గొర్రెల కాపరి రాజన్న రోదిస్తున్నాడు. వాటి విలువ దాదాపు లక్ష యాబై వేల రూపాయలు నష్టపోయామని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరారు. ఒక పక్క వీధి కుక్కల బెడదా.. మరో పక్క కోతుల బెడదాతో ప్రజలు వణుకుతున్నారు. వాటి నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.






