- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి: కేంద్ర మంత్రిని కోరిన కేటీఆర్
ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు విజ్ఞప్తి చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని కేంద్ర హెవీ ఇండస్ట్రీస్ శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామిని కలిసి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సీసీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదని మంత్రి స్పష్టం చేశారన్నారు. ప్లాంట్ పునఃప్రారంభం కావడానికి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ది ఎంతో అవసరమని పేర్కొన్నారు. కేంద్రం అడిగిన వివరాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. మారుమూల ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ ప్లాంట్‌ను తెరిపించే వరకూ బీఆర్‌ఎస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి సానుకూలత..
నేతల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించారని కేటీఆర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ ప్లాంట్‌ను మళ్లీ నడపాలనే బలమైన కోరికతోనే ఉన్నదని చెప్పారు. అక్కడ 2,300 ఎకరాల భూమి అందుబాటులో ఉన్నదని.. అందులో 770 ఎకరాలు కంపెనీకి చెందిన పట్టా ల్యాండ్ కాగా, 1,500 పైచిలుకు ఎకరాలు లీజ్ ల్యాండ్ రూపంలో ఉన్నదని పేర్కొన్నారు. ఇక్కడ రూ.2,000 కోట్ల పెట్టుబడితో సరికొత్త ఫ్యాక్టరీని పెట్టినట్లయితే చాలా బాగుంటుందని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారని తెలిపారు. అయితే.. ప్లాంట్ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వమే ప్రధాన ఆటంకంగా మారిందని నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా బీఆర్ఎస్ అనేక సందర్భాల్లో చేసిన ఒత్తిడి ఫలితంగా సీసీఐ ఆదిలాబాద్ పునరుద్ధరణపై సానుకూలంగా ఉన్నట్టు కేటీఆర్ తెలిపారు. సిసిఐ పునరుద్ధరణకు ఏడాది కాలంగా కేంద్రం ఇన్సెంటివ్స్, పవర్ సబ్సిడీ, క్యాపిటల్ సబ్సిడీ, జీఎస్‌టీ మినహాయింపులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరుతున్నా.. అక్కడ ఉన్న లోకల్ స్టేట్ గవర్నమెంట్ స్పందించకుండా విషయాలను దాటవేస్తున్నదని, మైనింగ్ లీజ్ పొడిగించడానికి ముందుకు రావడం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే సీసీఐ పునరుద్ధరణకు ప్రభుత్వం తరఫున పెట్టుబడి ప్రణాళికలను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో మాజీ మంత్రి జోగురామన్న, రాజ్యసభ బీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, సీసీసిఐ సాధన సమితి సభ్యులు ఉన్నారు.






