- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Srinivas: బీసీ బిడ్డ కాకపోయినా రేవంత్ బీసీ బిల్లు తెచ్చారు: ఆది శ్రీనివాస్
ఎంపీ రఘునందన్ రావుకు ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు దారుణం అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) విమర్శించారు. బీసీ బిడ్డ కాకపోయినా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బీసీ బిల్లు (BC Bill) తెచ్చారని సామాజిక న్యాయం పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనం అన్నారు. 55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్కసారైనా బీసీలను ప్రధాని చేశారా అని ఇవాళ కాంగ్రెస్ ను ప్రశ్నించిన రఘునందన్ రావుకు (Raghunandan Rao) తాజాగా ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. బీసీ బిల్లు అమలు కాకూడదని రఘునందన్ రావు కోరుకుంటున్నారని బీసీలకు న్యాయం చేసే విషయంలో బీజేపీకి క్లారిటీ లేదని దుయ్యబట్టారు. రాష్ట్రం పంపిన బిల్లును ఆమోదించకుండా కాంగ్రెస్ పై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. బీజేపీ అగ్రకుల పార్టీ అని బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తోందని ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, మా పార్టీని ప్రశ్నించే బదులు రఘునందన్ రావు మీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు? బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వమని అధిష్టానాన్ని మీరెందుుక అడగరు అని ఆది శ్రీనివాస్ నిలదీశారు. కాంగ్రెస్ చెప్పే సామాజిక న్యాయం మాటలకే పరిమితం కాదని మన్మోహన్ సింగ్ లాంటి నేతను రెండు సార్లు ప్రధానిగా చేసిన ఘనత మాదేనన్నారు.






