కేటీఆర్, హరీశ్ రావుకు చలి జ్వరం వస్తోంది : ఆది శ్రీనివాస్

by Muthe.Rajitha |

తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) బీఆర్ఎస్ నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు.

కేటీఆర్, హరీశ్ రావుకు చలి జ్వరం వస్తోంది : ఆది శ్రీనివాస్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(MLA Adi Srinivas) బీఆర్ఎస్ నేతలు కేటీఆర్(KTR), హరీష్ రావు(Harish Rao)లపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గోదావరి మరియు కృష్ణా నదుల జలాలపై ఢిల్లీలో జరిగిన చర్చలపై బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు ఉలికిపాటుకు గురవుతున్నారని విమర్శించారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహ పూర్వక చర్చలు జరిగితే మీకేందుకు జలి జ్వరం వస్తోందని మండిపడ్డారు.

బనకచర్ల ఎజెండాలో లేకపోవడంతో తెలంగాణ సెంటిమెంట్ ను రంగరించలేక కుమిలిపోతున్నారా అంటూ ఎద్దేవా చేసారు. మీలాగా రాయలసీమకు వెళ్లి చేపలు పులుసు తిని గోదావరి జలాలు రాసిస్తామని భ్రమపడ్డట్టు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ ను ప్రగతి భవన్ కు పిలిచి కృష్ణా జలాలను తాంబూలంలో పెట్టి ఇచ్చినట్లు మేం చేస్తామని అనుకుంటున్నారని విమర్శించారు.

కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని ఏటీఎంగా చేసుకుని కూలేశ్వరం మార్చింది మీరేనని, గోదావరి, కృష్ణా నీటిలో చుక్క నీరు తగ్గినా తగ్గేది లేదని స్వయంగా మా ముఖ్యమంత్రి చెబుతుంటే మీరెందుకు ఖంగారు పడుతున్నారని అన్నారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీ చాలని సంతకం పెట్టి తెలంగాణకు మరణశాసనం రాసింది కేసీఆర్ అని, రైతుల నోట్లో మట్టికొట్టింది మీరు ఈరోజు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.

Next Story