- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Addnaki Dayakar : విలీనం కాకపోతే మీ పార్టీని రద్దుచేసుకుంటారా?.. బీజేపీకి అద్దంకి దయాకర్ సవాల్
బీజేపీకి అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరిందని త్వరలోనే రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోతున్నదని బీజేపీ (BJP) నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addnaki Dayakar) కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీపై విషయం చిమ్మడం తప్ప మరో పని లేదని ఎటాక్ చేశారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (NVSS PRABHAKAR) చెప్పినట్లు జూన్ 2 లేదా డిసెంబర్ లో బీఆర్ఎస్ లో కాంగ్రెస్ (Congress) విలీనం కాకపోవడం రాష్ట్రంలో మీ పార్టీని రద్దు చేసుకుంటారా? అని అద్దంకి దయాకర్ సవాల్ విసిరారు. బీజేపీ మాటలు విని పక్క రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అబద్ధాలు నిజం అని నమ్మే పరిస్థితికి వచ్చారన్నారు. కాంగ్రెస్ ను ఎదుర్కొలేకనే ఈ రకమైన ప్రచారాన్ని బీజేపీ చేస్తోందన్నారు.
బీజేపీ, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒకటేనని ఈ రెండు పార్టీలు ఒక్కటేనని ప్రజలు గమనించే ఆ పార్టీలను పాతాళంలోకి తొక్కేశారన్నారు. డీల్ కుదిరిందని చెబుతున్న ఎన్వీఎస్ ప్రభాకర్ ఎవరెవరి మధ్య ఈ డీల్ కుదిరిందో చెప్పాలన్నారు. గతంలో కూడా ఇలా ఆరోపణలు చేస్తే ఏం జరిగింతే మీకు తెలుసన్నారు. బీజేపీ నేతల మెదడు మోకాళ్ల నుంచి అరికాళ్లలోకి పడిపోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతున్నారు. వీళ్ల మొఖాలు మారుతున్నాయే తప్ప వీరు మాట్లాడుతున్న అబద్ధాలు మారడం లేదన్నారు. కేసీఆర్ పార్టీ నుంచి గెంటేసిన సందర్భంలో కూడా ఇంతలా మాట్లాడని ఈటల రాజేందర్ పార్టీ అధ్యక్ష పదవి కోసమే లేక తన రాజకీయ మనుగడ కోసమే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నారని వారు తలకిందులు చేసినా తెలంగాణలో అధికారం రాదన్నారు.






