అలుగు వర్షిణికి అదనపు బాధ్యతలు

by Muthe.Rajitha |

రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా డా.వి.ఎస్.అలుగు వర్షిణి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

అలుగు వర్షిణికి అదనపు బాధ్యతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా డా.వి.ఎస్.అలుగు వర్షిణి గురువారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని కార్యదర్శి పేశీలో ఆమె ఈ బాధ్యతలను చేపట్టారు. అంతకుముందు, డా. అలగు వర్షిణి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శిగా ఉన్న అలగు వర్షిణికి గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.

Next Story