తెలంగాణలో ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతల అప్పగింత

by Malleboina Mahesh |   (  Updated:2025-06-28 17:03:17  IST  )

పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణలో ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతల అప్పగింత
X

దిశ, తెలంగాణ బ్యూరో : పలువురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary ) రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనర్‌గా ఉన్న కే.శశాంకకు టీజీఐఐసీ వైస్​చైర్మన్, ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఎండీగా ఉన్న విష్ణు వర్ధన్​రెడ్డి డిప్యూటేషన్​ పొడిగింపు రాకపోవడంతో ఆయన స్థానంలో శశాంక ను నియమించారు. టూరిజం డెవలప్మెంట్ ​కార్పొరేషన్​ఎండీగా ఉన్న వల్లూరి క్రాంతికి మైనింగ్, జీయాలజీ డైరెక్టర్​గా నియమించారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో శశాంక ఉన్నారు. సెర్ప్​అదనపు సీఈవోగా ఉన్న కాత్యాయని దేవి కి స్టేట్​ ఫైనాన్స్​ కార్పొరేషన్​ జాయింట్​మేనేజింగ్​ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఫ్యూచర్ సిటీ ఆడ్మిస్ట్రేటివ్​ ఆఫీసర్​గా పి.మహేందర్‌ను నియమించారు. ఆయన ఇప్పటి వరకు ఖమ్మం మెప్మా పీడీ పనిచేస్తున్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం లో మహేందర్​ మంత్రి కేటీఆర్ ఓఎస్డీగా పనిచేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చాక తాజాగా కీలక బాధ్యతలు అప్పగించారు.

Next Story