కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్

by Ajay Maddhiboyina |

సీఎం రేవంత్ స‌వాల్ స్వీక‌రిస్తున్నామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ కౌంట‌ర్ వేశారు. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అంటే మీ నాన్న రావ‌డం లేద‌న్నారు.

కేటీఆర్ కు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కౌంటర్
X

దిశ‌, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ స‌వాల్ స్వీక‌రిస్తున్నామంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌లపై ఎమ్మెల్సీ అద్దంకి ద‌యాక‌ర్ కౌంట‌ర్ వేశారు. అసెంబ్లీలో తేల్చుకుందాం రా అంటే మీ నాన్న రావ‌డం లేద‌న్నారు. నువ్వేమో బ‌స్తీమే స‌వాల్ అని చాలా జ‌బ‌ర్ధ‌స్త్ గా చెప్తున్నావంటూ ఎద్దేవా చేశారు. నిన్ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, నీతో చ‌ర్చిస్తే మీ బావ‌, ఆయ‌న‌తో చ‌ర్చిస్తే మీ చెల్లి మాతో ఎందుకు చ‌ర్చించ‌ర‌ని అంటార‌న్నారు. ముందు ఎవ‌రితో చ‌ర్చించాలో మీరు తేల్చుకోవాల‌ని కౌంట‌ర్ వేశారు. మీ డాడీని తీసుకుని నువ్వు, మీ ప‌రివారం వ‌స్తే చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని అన్నారు. స‌మ‌యం, ప్లేస్ మీ నాన్న‌ను చెప్ప‌మ‌ను రైతు స‌మ‌స్య‌లే కాకుండా ఏ ప్ర‌శ్న‌లైనా అడ‌గొచ్చ‌ని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే నిన్న సీఎం రేవంత్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో చేసిన అభివృద్ధిపై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని కావాలంటే చ‌ర్చ‌కు రావాల‌ని బీఆర్ఎస్ నేత‌లకు స‌వాల్ విసిరారు. ఆ స్వీక‌రిస్తున్నాన‌ని చెబుతూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌లు స్పందిస్తున్నారు.

Next Story