- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్ ఇడియట్ మాటలు బంద్ చెయ్.. అద్దంకి దయాకర్ కౌంటర్
కేటీఆర్.. ఇడియట్ మాటలు ఇక బంద్ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయాసలు వృధా అంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేటీఆర్.. ఇడియట్ మాటలు ఇక బంద్ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి చేస్తున్న ప్రయాసలు వృధా అంటూ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డిని డీ గ్రేడ్ చేయడానికి చూస్తే ఆయన అంతకంతకు పైకి ఎదుగుతుండని అన్నారు. సీఎంపై చేస్తున్న ఆరోపణలు, అసత్యప్రచారాలను చూస్తే నవ్వొస్తుందని అన్నారు. ఐదు సంవత్సరాలు అధికారం చేయాలని రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. గత 10 సంవత్సరాలు మీరు చేసిన దుర్మార్గపు పాలనకు ప్రజలు ఓటు దెబ్బతో ఇంట్లో కూర్చోబెట్టినా ఇంకా బుద్దిరావడం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు అంగీకరించడంతోనేగా రేవంత్ రెడ్డి సీఎం అయిందని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్ రెడ్డి ఏమి చేయలేకపోగా ఇంకా పరువు తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ బుడంకాయలు, వంకాయలు, దోసకాయలు రేవంత్ రెడ్డిని ఏమి చేయలేవని అన్నారు. కేసీఆర్ చేతకాకనే కామ్ గా ఇంట్లో పడుకున్నాడు. ఇక మీ చేత ఏమైతదని ప్రశ్నించారు. మీ భాషను మార్చుకోకపోతే టీం బీ వస్తుంది మీరు తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్ ను కాపాడే శక్తులు, ఇక బీఆర్ఎస్ ను బ్రతికించే పరిస్థితి లేదని, ప్రజల మిమ్మల్ని బండకేసి బాదితే ఇంట్లో పడుకోవల్సింది పోయి అవాకులు చవాకులు చేస్తున్నారని అన్నారు. చినిపోయిన పార్టీని ఎంత బతికించాలనుకున్నా వృధా అవుతుందని తెలిపారు.






