- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారాలా ఉంది: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగం కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నారు. కేసీఆర్ అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ఎక్కడికో తీసుకుపోయిందని చెబుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజలను దోచుకుందని విమర్శించారు. రైతు రుణ మాఫీ, ఉచిత కరెంటు, ఉచిత బస్సు, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలు మీ కళ్లకు కనిపించడం లేదంటూ మండిపడ్డారు. ప్రత్యేకించి బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణ చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే దాని మీద మాట్లాడరని అన్నారు.
బీఆర్ఎస్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరి చేస్తోందని అద్దంకి చెప్పుకొచ్చారు. రెండు మూడు అంశాలు ముందు పెట్టి అమలయ్యాయా? అని ప్రశ్నిస్తే అక్కడ ఉండేది మీ మనుషులే కాబట్టి అయ్యాయి అని ఎందుకు చెబుతారన్నారు. దమ్ముంటే ఉచితబస్సు ఇవ్వడం తప్పని చెప్పాలని, ఉచిత గ్యాస్ ఇవ్వడం తప్పని చెప్పాలని అన్నారు. స్వయం డబ్బా తప్ప కేసీఆర్ స్పీచ్‌లో ఏమీ లేదని విమర్శించారు. మీ స్పీచ్ హింసరాజ్ మాదిరిగా ఉందని అన్నారు. అంతర్జాతీయ సమాజం రేవంత్ రెడ్డిని పొగుడుతున్న తీరు మీకు అర్థం అవ్వట్లేదా అని ప్రశ్నించారు. బీజేపీని ఏదో కావాలని తిట్టినట్టు తిట్టినా మీరంతా ఒకటేనని అర్థమైందని మండిపడ్డారు.






