జనతా గ్యారేజ్‌లో కొడుకు విలన్.. కేటీఆర్ విలనేనా? ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీఆర్ఎస్ పార్టీ జనతా గ్యారేజ్ అని కేటీఆర్ మాట్లాడుతున్నారని అద్దంకి దయాకర్ అన్నారు.

జనతా గ్యారేజ్‌లో కొడుకు విలన్.. కేటీఆర్ విలనేనా? ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఖర్చులు తగ్గడానికే (Ministers helicopter) మంత్రులు హెలికాప్టర్‌లలో పోతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) హాట్ కామెంట్స్ చేశారు. గురువారం గాంధీభవన్ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ వాళ్లు హెలికాప్టర్ల గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముగ్గురు మంత్రులు వెళ్తే కాన్వాయ్‌కి అయ్యే అర్థిక భారం కంటే.. ఒక హెలికాప్టర్‌లో పోతే ఎంత ఖర్చు అవుతుందని అద్దంకి దయాకర్ అన్నారు. మీ లాగా సొంత విమానాలు కాంగ్రెస్ పార్టీకి లేవని అన్నారు. కాళేశ్వరం చూసేందుకు కూడా ఆఫీసర్లు, విజిటర్లకు హెలికాప్టర్లు పెట్టడం లేదన్నారు. ఒక రోజు రెండు మూడు ప్రోగ్రాములు ఉంటాయని, సుదూర ప్రాంతాలకు పోయి రావడం ఇబ్బందిగా ఉండే పరిస్థితుల్లోనే మంత్రులు హెలికాప్టర్లు వాడుతున్నారని చెప్పారు. మీలాగా ఇష్టానుసారంగా.. విలాసాలకు హెలికాప్టర్లు వాడలేదన్నారు.

బీఆర్ఎస్ పార్టీకి 25 ఏళ్ల, టీఆర్ఎస్‌కు 25 ఏళ్ల అని అద్దంకి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఏర్పడి రెండు, మూడేళ్లు మాత్రమే అయిందన్నారు. బీఆర్ఎస్ (BRS) పార్టీ జనతా గ్యారేజ్ (Janatha Garage) అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారని అన్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో ఓనర్ మోహన్ లాల్ కొడుకు విలన్ అని, అంటే (KCR) కేసీఆర్ కొడుకు కూడా విలనా? బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ లో కేటీఆర్ (KTR) విలానా? అని సెటైర్లు వేశారు. ఒక విషయం మాట్లాడేటప్పుడు వాస్తవాలు ఏదో తెలుసుకోవాలని సూచించారు. హెచ్‌సీయూ విషయంలో కేటీఆర్ ఇచ్చిన తప్పుడు సమాచారం వల్ల బుల్డోజర్‌కు, జేసీబీకి తేడా తెలియకుండా మోడీ మాట్లాడుతున్నారని విమర్శించారు.

Next Story