కవిత లేఖపై కాంగ్రెస్ ప్రమేయం లేదు.. నెం 02 పొజిషన్ కోసం.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్

by Ramesh Naini |

బీఆర్ఎస్‌లో రాజకీయ కలకలం రేగుతున్నట్లు కన్పిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అభిప్రాయపడ్డారు.

కవిత లేఖపై కాంగ్రెస్ ప్రమేయం లేదు.. నెం 02 పొజిషన్ కోసం.. అద్దంకి దయాకర్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: (BRS) బీఆర్ఎస్‌లో రాజకీయ కలకలం రేగుతున్నట్లు కన్పిస్తోందని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా ఒక వీడియోలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా ప్రచారం జరుగుతున్న ఉత్తరం వారి పార్టీ అంతర్గత విషయం అని చెప్పుకొచ్చారు. కానీ లేఖకు సంబంధించి కాంగ్రెస్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. కవిత రాసిన లేఖ కాంగ్రెస్ ఏదో చేసినట్లు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారని, (Congress) కాంగ్రెస్ పార్టీ ఏదో లీక్ చేసిందని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు. అది బీఆర్ఎస్ అంతర్గత రాజకీయ సంక్షోభం అయ్యుండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తండ్రి (KCR) కేసీఆర్‌తో అంతర్గత అంశాలు కవిత చెప్పుకోలేనంత గ్యాప్ వచ్చిందని తెలిపారు. కవిత లేదంటే బీఆర్ఎస్ నాయకులే దాని వివరణ ఇవ్వాలని అన్నారు. కొన్ని రోజుల నుంచి కవిత వివిధ వేదికలపై చేస్తున్న ప్రకటనలకు ప్రతిరూపంగా లేఖలోని అంశాలు కనిపిస్తున్నాయని అన్నారు. వరంగల్ సభ బీఆర్ఎస్‌లోని కుటుంబ నాయకుల మధ్య అంతరాన్ని పెంచి.. నెం 02 పొజిషన్ కోసం పోరాటం మొదలైందన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్ మారిన తర్వాత బీజేపీ తో స్నేహం కొనసాగిస్తోందని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్‌లో మూడు ముక్కలాట అంతర్గత పోరు కొనసాగుతుందని తెలిపారు. ఈ తరహా రాజకీయాలని కాంగ్రెస్ ఎప్పుడూ ప్రోత్సహించదని, ఇటువంటి దుర్గతి కాంగ్రెస్‌కు లేదని అద్దంకి దయాకర్ అన్నారు.

Next Story