- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Caste politics: రాహుల్ గాంధీ కులం గురించి చెప్పిన అద్దంకి దయాకర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏ కులానికి చెదిన వారు? ఆయన మతం ఏంటని తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi's caste) ఏ కులానికి చెదిన వారు? ఆయన మతం ఏంటని (Telangana BJP) తెలంగాణ బీజేపీ నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ కామెంట్స్‌పై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ (Addanki Dayakar) స్పందించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఒక వీడియోలో కౌంటర్ ఇచ్చారు. కులమత రాజకీయాలు చేసే మీకు రాహుల్‌గాంధీ కులం ఏందో తెలియని దుస్థితిలో ఉండటం సిగ్గుపడాల్సిన విషయం అని విమర్శించారు. రాహుల్‌గాంధీ కులం ‘పండిత్’ అంటే బ్రాహ్మణ కులం.. అని స్పష్టం చేశారు. మీరు మనువాదులు కాబట్టి.. పేదల కోసం రాజ్యాంగాన్ని రక్షించేందుకు రాహుల్ గాంధీ పోరాడుతున్న వైనం మీకు నచ్చడం లేదన్నారు.
రాహుల్ కాబోయే ప్రధాని అని ఆ దృష్టితోనే ఆ కుటుంబాన్ని బీజేపీ నాయకులు కించపరుస్తున్నారని ఆరోపించారు. గాంధీనే కించపరిచే మీకు సంస్కృతి, సంస్కారాలు ఉంటాయని అనుకోవడం లేదని విమర్శించారు. ప్రధాని మోడీ కన్వర్టెడ్ బీసీ, ఒరిజినల్ బీసీ కాదని, తన కులాన్ని బీసీగా మార్చుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాటలు గుర్తుకు చేశారు. ఇలా ఒరిజినల్ బీసీ కాదని మాట్లాడినందుకు బీజేపీ నాయకులకు నచ్చడం లేదని, అందుకే రాహుల్‌పై కామెంట్స్ చేసే స్థితికి దిగజారారని మండిపడ్డారు.






