మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ అసహనం

by Disha Web Desk 2 |
మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలపై అద్దంకి దయాకర్ అసహనం
X

దిశ, వెబ్‌డెస్క్: మర్రి శశిధర్ రెడ్డి కామెంట్స్‌పై అద్దంకి దయాకర్ వీడియో విడుదల చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీనియర్లు ఇలా మాట్లాడటం సరికాదని అన్నారు. అంతర్గత అంశాలను సరిదిద్దే బాధ్యత మీరే తీసుకోవాలంటూ హితవు పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్గత అంశాలపై మనలో మనం కొట్టుకోవడం సరికాదని అన్నారు. మరోవైపు మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై శశిధర్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏజెంట్‌గా మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించడం రాష్ట్ర కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వేదికగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరుగనుంది.

Read Also:

మునుగోడుకు ఉప ఎన్నిక రావడానికి కారణం ఇదే: గుత్తా


Next Story

Most Viewed