- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Addanki Dayaka: దమ్ముంటే కేసీఆర్ ను తీసుకుని అసెంబ్లీకి రా.. కేటీఆర్ కు అద్దంకి కౌంటర్
కేటీఆర్ కు అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: కేసీఆర్ కు చట్టసభలు అంటే గౌరవం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ (Addanki Dayakar) విమర్శించారు. అందుకే అసెంబ్లీలో చర్చకు రాకుండా బయట డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కేటీఆర్ (KTR) ప్రెస్ మీట్ పై కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఇవాళ సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అద్దంకి దయాకర్.. దమ్ముంటే కేటీఆర్ అసెంబ్లీకి కేసీఆర్ ను తీసుకుని రావాలని లేకుంటే దద్దమ్మలా మిగిలిపోతావ్ అని ఘాటు విమర్శలు చేశారు. కేటీఆర్ అసలు ని స్థాయి ఏంటి? నీకే స్థాయి లేదు నీకు మేమే ఎక్కువ. కేటీఆర్ ఇకనైనా ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని తెలంగాణ ప్రజలు మిమ్మలని నమ్మే పరిస్థితులో లేరన్నారు. ప్రజలు కేసీఆర్ ను ప్రతిపక్షనాయకుడి బాధ్యతలు అప్పగిస్తే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో పండుకున్నారని విమర్శించారు. మీ కుటుంబంలో తలెత్తిన సమస్యల వల్ల కేటీఆర్ ప్రస్టేషన్ ను రాష్ట్రం ఎందుకు భరించాలని ప్రశ్నించారు. అసెంబ్లీకి రాని వాళ్ళు అసెంబ్లీ దొంగలు మీరు అని ధ్వజమెత్తారు. కేటీఆర్ నువ్వు చేస్తున్న దానికి ఆ మురికి కాలువలో మునిగి చావాలని నిన్ను ఏ డాక్టర్ కూడా మార్చలేడని దుయ్యబట్టారు.






