- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బతుకమ్మ పండుగపై నటి ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబురాల్లో సినీ నటి ఖుష్బూ సుందర్(Khushbu Sundar) పాల్గొన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సంబురాల్లో సినీ నటి ఖుష్బూ సుందర్(Khushbu Sundar) పాల్గొన్నారు. బీజేపీ మహిళా నేతలతో కలిసి ఆడిపాడారు. ఈ సందర్భంగా కుష్బూ మాట్లాడారు. ముందుగా తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణలో బతుకమ్మ పండుగ చాలా ప్రత్యేకమైనదని అన్నారు. ఈ పండుగ వేళ మోడీ జీఎస్టీ తగ్గించి డబుల్ బొనాంజా ఇచ్చారని చెప్పారు. మహిళలు ఆనందంగా పండుగ జరుపుకునేలా చేశారని వెల్లడించారు. జీఎస్టీ తగ్గింపు దేశ ప్రజలకు పండగ లాంటిదని అన్నారు. కాగా, తెలంగాణ సాంప్రదాయంలో బతుకమ్మ పండుగ ప్రత్యేకం. చిన్నా–పెద్దా తేడా లేకుండా స్త్రీలు, పిల్లలు అందరూ బతుకమ్మ చుట్టూ చేరి పాటలు పాడుతూ, సంతోషంగా ఆడుతూ పాడుతూ వేడుకలు నిర్వహిస్తారు. పచ్చని ప్రకృతి నుంచి వచ్చే రంగు రంగుల పూలతో గౌరమ్మను అలంకరించి, ప్రతిరోజూ ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ పూజించడం ఈ పండుగ ప్రధాన ఆకర్షణ. బతుకమ్మ అంటే కేవలం పువ్వులు పేర్చిన గోపురం మాత్రమే కాదు, అది తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయత, భక్తి, ఆనందాల సమ్మేళనం.సెప్టెంబర్ 21 ఎంగిలి పూల బతుకమ్మతో బతుమ్మ పండుగ వేడుకలు మొదలయ్యాయి.






