అట్లాంటలో నటుడి కొడుకు మిస్సింగ్.. చివరిగా అక్కడి నుంచి కాల్

by Naga Rani Yarlagadda |

అట్లాంటాలో ఉంటోన్న తెలుగు యువకుడు మిస్సైనట్లు తెలుస్తోంది. జూన్ 22న అతను తనకు ఎయిర్ పోర్టు నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడాడని తండ్రి, నటుడు శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు.

అట్లాంటలో నటుడి కొడుకు మిస్సింగ్.. చివరిగా అక్కడి నుంచి కాల్
X

దిశ, వెబ్‌డెస్క్: అట్లాంటాలో ఉంటోన్న తెలుగు యువకుడు మిస్సైనట్లు తెలుస్తోంది. జూన్ 22న అతను తనకు ఎయిర్ పోర్టు నుంచి వీడియో కాల్ చేసి మాట్లాడాడని తండ్రి, నటుడు శ్రీధర్ రెడ్డి చెబుతున్నారు. ఆ వీడియో కాల్ తర్వాత తన కొడుకు నుంచి ఎలాంటి కాల్, మెసేజ్ రాలేదని ఆవేదన చెందుతున్నారు. తన కొడుకు మొబైల్ ఎయిర్ పోర్టులో మిస్సైనట్లు చెప్తున్నారని, ఫోన్ మాత్రమే మిస్సైతే మరో ఫోన్ నుంచైనా కాల్ చేయలేదని వాపోతున్నారు. కొడుకు జాడ కనిపెట్టాలని శ్రీధర్ రెడ్డి కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందించి తన కొడుకు జాడ కనిపెట్టాలని వేడుకున్నారు.

Next Story