- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇకపై కేవలం సినిమాలే! మళ్లీ యాక్టివేట్ అయిన రాహుల్ రామకృష్ణ ట్విట్టర్ అకౌంట్.. మరో ఆసక్తికర పోస్ట్
ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ దసరా పండుగ నాడు వరుస ట్వీట్లతో రచ్చ రచ్చ చేసిన ఆయన తన ఖాతాను డీయాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణ (Actor Rahul Ramakrishna) దసరా పండుగ నాడు వరుస ట్వీట్లతో రచ్చ రచ్చ చేసిన ఆయన తన ఖాతాను డీయాక్టివేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‌ను యాక్టివేట్ చేశారు. కేసీఆర్ తిరిగొచ్చే సమయం ఆసన్నమైందంటూ ట్వీట్ చేసిన రాహుల్.. దుర్భర స్థితిలో బతుకుతున్నామని.. హామీలన్ని విఫలం అయ్యాయని ట్వీట్లు చేశారు. పరోక్షంగా రేవంత్ సర్కార్ చురకలంటించడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. దాంతో.. రాహుల్ ట్విట్టర్ ఖాతా ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఇప్పుడు అతని అకౌంట్ యాక్టివేట్ అవ్వడంతో.. నెటిజన్ల గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. మరోవైపు పండుగ పూట ప్రభుత్వ పరిపాలన గురించి వేసిన (ట్వీట్‌లు) పోస్టులు అన్ని హైడ్ లేదా డిలీట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇవాళ (శనివారం) గత పోస్టులను ఉద్దేశించి ట్వీట్ చేశారు.
నా కంటే గొప్ప మేధావులు చాలా కాలంగా సామాజిక సమస్యలతో పోరాడుతున్నారని తెలిపారు. పాలన, పరిపాలనల గురించి నాకు ఏమి తెలుసు? నేను ఒక చిన్న నటుడిని మాత్రమే అని తెలిపారు. వివిధ రాజకీయ నాయకులతో మాట్లాడిన తర్వాత తన అసహనం సరైన దిశలో లేదని తెలుసుకున్నారని తెలిపారు. దేశం, రాష్ట్రం అభివృద్ధే తన ఆకాంక్ష అని, ఎవరు పాలించినా మంచి జరగాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఇకపై ట్విట్టర్ ద్వారా రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా, తన వృత్తిపరమైన పనిపైనే (సినిమా) దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. చివరగా “జై తెలంగాణ, జై హింద్” అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్‌కు కూడా నెటిజన్‌లు, తన అభిమానులు అనేక కామెంట్స్ చేశారు. ఇవన్నీ ‘నీకు ఎందుకు కాక..? చక్కగా సినిమాల్లో జోకులు వేసుకోక’ అంటూ ఓ యూజర్ కామెంట్ చేశారు. ‘తాగినప్పుడు ట్వీట్‌లు వేయకు అన్న’ అని మరో నెటిజన్ విమర్శిస్తూ కామెంట్ పెట్టారు. ‘ఇంతకీ నీకు ఏమైంది అన్న.. ఎందుకు ట్రోల్ అవుతున్నావ్’ అని మరో నెటిజన్ కామెంట్ పెట్టారు. ట్వీట్ ఇదే..






