- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
INDIGO: ఇండిగో సిబ్బందితో యాక్టర్ నరేష్ గొడవ.. లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్
ఇండిగో సిబ్బంది తీరుపై యాక్టర్ నరేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇండిగో ఎయిర్ లైన్స్ (IndiGo Airlines) సంస్థ తీరు ఇటీవల వివాదాస్పదం అవుతోంది. చెప్పాపెట్టకుండా విమానాల రద్దుతో ప్రయాణికులు ప్రత్యక్ష నరకం అనుభవించిన సంగతి మరువక ముందే ఆ సంస్థ తీరుపై విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇండిగో సంస్థపై యాక్టర్ నరేశ్ (Actor Naresh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హైదరాబాద్ నుంచి మైసూర్ వెళ్లేందుకు ఇండిగో విమానంలో టికెట్ పర్చేజ్ చేశారు. ఎయిర్ పోర్టులో విమానం వద్దకు తీసుకువెళ్లే ఇండిగో బస్సులో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లోని బస్సులు టార్చర్ చాంబర్లుగా మారాయని ఇవి ఎయిర్‌లైన్ గుత్యాధిపత్యానికి బాధాకరమైన ఉదాహరణలుగా నిలుస్తున్నాయని తన అనుభవాలను ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను పశువుల్లో బస్సులోకి కుక్కుతున్నారని చాలా మంది సీనియర్ సిటిజన్లు కూడా నిలబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వీల్‌చైర్లలో ఉండి నిలబడలేక తీవ్రంగా ఇబ్బంది పడ్డారని బస్సును ఓవర్ లోడ్ చేయాలని తాను గొంతు చించుకుని అరవాల్సి వచ్చిందన్నారు. బస్సులకు తప్పనిసరిగా ఒక నిర్దిష్ట ప్రయాణికుల పరిమితి ఉండాలని అలాగే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్థలం కల్పించాలని రాసుకొచ్చారు. ఇండిగో తీరుపై న్యాయ పోరాటం చేస్తానని లీగల్ యాక్షన్ తీసుకుంటానని హెచ్చరించారు.






