- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయితీ మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది..

దిశ, వెబ్ డెస్క్: నటుడు మోహన్ బాబు(Actor Mohan Babu) ఫ్యామిలీ పంచాయితీ మరోసారి ఉద్రిక్తతలకు దారి తీసింది. గత కొన్ని రోజులుగా మనోజ్, విష్ణు, మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా సైతం మళ్లీ ఈ వివాదం తెరపైకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి(Jalpalli)లో మోహన్ బాబు ఇంటి వద్దకు కుటుంబంతో కలిసి మంచు మనోజ్(Manchu Manoj) వెళ్లారు. గత కొన్ని రోజులుగా మనోజ్ కుంటుంబం బయట ఉంటున్నారు. తాజాగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. తనకు ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నారు. అయితే గేటు తీయకపోవడంతో ఇంటి ముందు బైఠాయించారు. తన తండ్రి మోహన్ బాబుతో మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తాను కదిలేది లేదని అంటున్నారు.
అయితే తన కారును సోదరుడు మంచు విష్ణు(Manchu Vishnu) తీసుకెళ్లాడని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఇప్పటికే నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాను ఊరిలో లేనప్పుడు తన వస్తువులన్నీ తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు.
ఈ పరిణామంతో మోహన్ బాబు ఇంటి వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోహన్ బాబు ఇంటి నుంచి రెండు కిలో మీటర్ల మేర ఆంక్షలు విధించారు. భారీగా మోహరించారు.






