- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌కు గాయం.. స్పందించిన జూనియర్ ఎన్టీఆర్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్‌కు జరిగిన ప్రమాదంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు..

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) కుమారుడు మార్క్ శంకర్(Mark Shankar)కు జరిగిన ప్రమాదంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) స్పందించారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. ‘‘లిటిల్ వారియర్.. నువ్వు ధైర్యంగా ఉండాలి. పవన్ కల్యాణ్ ఫ్యామిలీ ధైర్యంగా ఉండాలి.’’ అని ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
కాగా సింగపూర్ ఆస్పత్రి(Singapore Hospital)లో మార్క్ శంకర్(Mark Shankar)కు చికిత్స కొనసాగుతోంది. సింగపూర్‌లో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఐసీయూలో చికిత్స అందించారు. ప్రస్తుతం కొంత మెరుగు కావడంతో ఐసీయూ నుంచి మార్క్‌ను వార్డులోకి మార్చారు. పొగ వల్ల తలెత్తే సమస్యలపై వైద్యులు పరీక్షలు చేస్తున్నారు. మరో మూడు రోజుల పాటు మార్క్ శంకర్ వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారు. అయితే పవన్ కల్యాణ్.. మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళ్లారు. మార్క్‌ను పరామర్శించారు. చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
Saddened to hear about Mark Shankar being caught in a fire mishap in Singapore. Wishing him a speedy recovery. Stay strong ,little warrior ! Strength and prayers to Shri @PawanKalyan garu and family.
— Jr NTR (@tarak9999) April 9, 2025






