Dulquer: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లక్కీ భాస్కర్ (దుల్కర్ సల్మాన్)

by Ramesh Naini |

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

Dulquer: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లక్కీ భాస్కర్ (దుల్కర్ సల్మాన్)
X

దిశ, డైనమిక్ బ్యూరో: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకోని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన విషయం తెలిసిందే. మహానటి, సీతారామం.. వంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ సంపాదించారు. తాజాగా ఈ లక్కీ భాస్కర్ ఫేమ్.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేక భేటీ అయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని సినీ నటుడు దుల్కర్ సల్మాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు సినీ నిర్మాత స్వప్న దత్, తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్‌ను శాలువ కప్పి సత్కరించారు. కాగా, దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో సెల్వమణి సెల్వరాజ్ రూపొందిస్తున్న ‘కాంత’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు.

Next Story