- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలా పుట్టుకొచ్చినవాడే ఐ-బొమ్మ రవి.. నటుడు నరసింహారావు కామెంట్స్
అలా పుట్టుకొచ్చినవాడే ఐ-బొమ్మ రవి.. నటుడు నరసింహారావు కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: ఐ-బొమ్మ రవి కేసు(Ibomma Ravi Case)లో నటుడు సీవీఎల్ నరసింహారావు(CVL Narasimha Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన ఓ మీడియా ఛానల్ ప్రతినధితో మాట్లాడారు. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమాల్లో హీరోల మాదిరిగానే ఒకరు పుట్టుకువస్తారు.. అలా పుట్టుకువచ్చిన వాడే ఐబొమ్మ రవి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐబొమ్మ రవి కేసులో నేను ఒక న్యాయ సలహా ఇవ్వాలని అనుకున్నాను.. కానీ ఎక్కడా నేను అడ్వొకేట్‌గా ఉన్నానని చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో సినిమా కార్మికులు చాలా నష్టపోయారు.. వారి గురించి ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందారు. నిర్మాతలకు నష్టం వస్తే మాత్రం మొత్తం వ్యవస్థనే కదిలిందని అన్నారు. ఐబొమ్మ రవి విషయంలో తప్పు నిర్మాతలదే అని.. వారిపై వారే భస్మాసుర హస్తం ప్రయోగించుకున్నారని అన్నారు. ఐబొమ్మ రవిపై నిర్మాతలు తప్ప ఎవరూ ఫిర్యాదు చేయలేదని గుర్తుచేశారు. కేవలం నిర్మాతలే అతన్ని రాబిన్‌హుడ్‌లా చూస్తున్నారు.. కానీ అతను రాబిన్‌హుడ్ కాదని స్పష్టం చేశారు.
మరోవైపు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల నుంచి నటుడు సీవీఎల్ నరసింహారావు తప్పుకున్నారు. అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసిన ఆయన.. తాజాగా ఆ నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అధ్యక్ష పదవి కంటే తనకు మా సభ్యుల సంక్షేమమే ముఖ్యమన్నారు. పోటీలోని 2 ప్యానెళ్లలో ఎవరికీ తాను మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.
Read More...ఐబొమ్మ రవిని స్వయంగా విచారిస్తున్న CP సజ్జనార్






