- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మా అమ్మను అలా అనడంతోనే గొడవ.. డెలివరీ బాయ్‍తో గొడవపై యాక్టర్ అఖిల్ రాజ్ క్లారిటీ
ఏం జరిగిందో తెలుసుకోకుండానే తమపై విమర్శలు చేస్తున్నారని నటుడు అఖిల్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డెలివరీ బాయ్ తో గొడవ వెనుక ఏం జరిగిందో వివరించాడు.

దిశ, డైనమిక్ బ్యూరో: డెలివరీ బాయ్‍కు తనకు మధ్య జరిగిన వివాదంపై రాజు వెడ్స్ రాంభాయ్ ఫేమ్ అఖిల్ రాజ్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఈ ఘటన వెనుక ఏం జరిగింతో తన వాదనను వివరించారు. మా ఇంటి ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీలోని ఓ ప్లాట్‍లో ఇవ్వాల్సిన పార్సిల్ ను డెలివరీ బాయ్ అరుణ రెసిడెన్సీ లో ఉన్న మా ప్లాట్‍లో ఇచ్చాడని అయితే మా ఇంట్లో వారు ఎవరో ఒకరు ఆర్డర్ చేసి ఉంటారని ఆ పార్సిల్‍ను మానాన్న రిసీవ్ చేసుకున్నట్లు చెప్పాడు. అయితే పార్సిల్ పై చేలం రెసిడెన్సీ చిరునామా స్పష్టంగా ఉంది. ఈ విషయం తెలియక మా అమ్మ ఆ ప్యాకెట్‍ను ఓపెన్ చేసిందని అయితే ఆ వస్తువును మా ఇంట్లో వారు ఎవరూ ఆర్డర్ చేయలేదని తెలిసి దాన్ని పక్కన పెట్టేశాం. దాదాపు 20 నిమిషాల తర్వాత ఆ డెలివరీ బాయ్ మళ్లీ మా ఫ్లాట్‍కు వచ్చి పార్సిల్ తిరిగి ఇవ్వాలని అడిగాడు. అందుకు బ్రదర్ మీరు అడ్రస్ సరిగా చూసుకున్నారా అని అడిగితే అతను లేదు నేను చూసుకోలేదు ఇచ్చేశానంతే అని చెప్పాడు.
మా అమ్మను అలా అనడంతో..
ఇంతలో మా అమ్మ వచ్చి బాబు తెలియక ఓపెన్ చేశాం ఏమీ అనుకోకండి అని పార్సిల్ తిరిగి ఇచ్చేసింది. కానీ మద్యం మత్తులో ఉన్న ఆ డెలివరీ బాయ్ మాత్రం వెళ్తూ వెళ్తూ ఫ్రీగా వస్తే ఓపెన్ చేసి తీసుకుంటారా అని మాట్లాడాడు. అమ్మను అంటే ఎవరికైనా కోపం వస్తుంది. నాకూ కోపం వచ్చి అతనితో సరిగా మాట్లాడాలని హెచ్చరించాను. ఇంతలో నువ్వు హీరో కాద చూడు ఏం చేస్తానో అంటూ వీడియో తీయడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో మా మధ్య వాగ్వాదం జరిగిందని అఖిల్ రాజ్ చెప్పుకొచ్చాడు. పనిగట్టుకుని డెలివరీ బాయ్‍తో గొడవపడాల్సిన అవసరం నాకేంటి? ఒకప్పుడు నేనూ డెలివరీ బాయ్‍గా పని చేశానని అతడు తప్పుగా మాట్లాడటం వల్లే ఇదంతా జరిగిందన్నాడు. డెలివరీ బాయ్‍పై పోలీసులకు ఫిర్యాదు చేశానని నా వైపు తప్పు ఉంటే కచ్చితంగా క్షమాపణ చెబుతా కానీ మా అమ్మను అంటే ఊరుకోనని చెప్పాడు.
రాంగ్ అడ్రస్‍కు కండోమ్ ప్యాకెట్లు:
తమకు ఎదురుగా ఉన్న చేలం రెసిడెన్సీలో ఫ్లాట్ నంబర్ 201 వారు తమ అడ్రస్‍లో ఆపోజిట్ అరుణ రెసిడెన్సి అని మెన్షన్ చేయడం వల్ల వారికి వెళ్లాల్సిన పార్సిల్స్ మాకు వస్తున్నాయి. ఇప్పటికి పది సార్లు తమ అడ్రస్‍కు వచ్చాయని కొన్ని సార్లు సిగరేట్లు, కండోమ్ ప్యాకెంట్లు కూడా వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ సభ్యులు ఉన్న చోటకి ఇలా వస్తే ఎలా ఉటుంది. నిజం తెలుసుకోకుండా నామీద, నా తల్లిదండ్రుల మీద సోషల్ మీడియాలో దుర్భాషలు ఆడుతున్నారు. కానీ మీ ఇంట్లో వారిని ఇలా తప్పుగా మాట్లాడితే మీరు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.






