- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడవినీ, అడవీ జంతువులను కాపాడుకుందాం
క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామని పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్

అడవినీ, అడవీ జంతువులను కాపాడుకుందాం
* వన్యమృగాలపై దాడులు చేస్తే చర్యలు
* క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రేషియా
* వాటికి విషం పెట్టి చంపితే చర్యలు
* పీసీసీఎఫ్ సువర్ణ
దిశ, తెలంగాణ బ్యూరో: క్రూర మృగాల దాడిలో మనుషులు చనిపోతే పది లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తున్నామని పీసీసీఎఫ్(ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఫారెస్ట్) సువర్ణ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మీడియా సమావేశలో మాట్లాడారు. క్రూర మృగాలు దాడిచేశాయన్న అక్కసుతో వాటికి విషం పెట్టి చంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అటవీ చట్టం ప్రకారం బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. క్రూర మృగాల దాడిలో చనిపోయిన పెంపుడు జంతువులకు పరిహారం అందజేస్తామని అన్నారు. అడవిని, అటవీ జంతువులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. పులి కంటే చిరుతపులి తెలువైందని, ఇటీవలే చిరుత ORR ను రెండు సార్లు దాటిందని, అది ఇప్పటి వరకు ఎవరిపైనా దాడి చేయలేదని స్పష్టం చేశారు. అనంతరం ఫారెస్ట్ లోకి వెళ్ళిందని చెప్పారు. నగరంలో చుట్టూ పక్కల అటవీ ప్రాంతం అంతరించడంతో, అడవిలో సరైన ఆహారం దొరక్కపోతే బయటకి వస్తున్నాయని అన్నారు.
ఆహారం లేకపోవడంతోనే అటవీ జంతువులు మానవులపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మూడు వారాల తర్వాత మంచిరేవులలో గురువారం చిక్కిన చిరుత మగదని 5 నుంచి 6 సంవత్సరాల వయస్సు ఉంటుందని చెప్పారు. ఈ ఒక్క చిరుతకే ఇంత సమయం పట్టిందని, రాష్ట్రంలో ఇంకా తిరుగుతున్నాయని అన్నారు. వీటి పట్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కవ్వాల్ పులుల అభయారణ్యం పులులకు అంతా సేఫ్ లేదని దీంతో అక్కడ ఉన్న పులులు మహారాష్ట్ర తాడోబ పులుల అభయారణ్యంకు వెళ్తున్నాయని, అక్కడి నుంచి ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్నాయని అన్నారు.
అందుకే ఇక్కడ స్థిరంగా ఉండలేకపోతున్నాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతం పులులకు సేఫ్ జోన్ గా మారిందని, వాటికి సరిపడే శాఖహార జంతువులు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా నది కూడా వాటికి రక్షణ వలయంగా మరిందన్నారు. చిరుత పులుల సంచారం పెరుగుతుందని, పులుల సంతానం పెద్దగా పెరగలేదు కాని ఇప్పుడిప్పుడే వాటి సంఖ్య పెరుగుతుందని అన్నారు. చిరుత పులులు సంచరిస్తే టోల్ ఫ్రీ 040 23231772 కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.






