- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేంద్ర మంత్రి కొడుకుపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ మహిళా నేతల డిమాండ్
బండి భగీరథ్ చేతిలో అన్యాయానికి గురైన బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ చేతిలో అన్యాయానికి గురైన బాధితురాలికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆపదని ఆ పార్టీ మహిళా నేతలు స్పష్టం చేశారు. బుధవారం ఈ మేరకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. బాధితురాలిని స్వయంగా కలిసి వాస్తవాలు తెలుసుకుంటామని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చట్టపరంగా దోషులపై కఠిన చర్యలు తీసుకునేందుకు, బాధితురాలికి న్యాయం చేసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన బాధితురాలి కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, ఆ కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నామని వారు వివరించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, నేరెళ్ల శారద, ఎర్రబెల్లి స్వర్ణ పునరుద్ఘాటించారు.






