కంకర ఓవర్ లోడ్ వల్లే ప్రమాదం : పోలిసులు

by Muthe.Rajitha |

హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి 163 పై (Hyderabad-Bijapur NH 163) మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసిందే.

కంకర ఓవర్ లోడ్ వల్లే ప్రమాదం : పోలిసులు
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ -బీజాపూర్ జాతీయ రహదారి 163 పై (Hyderabad-Bijapur NH 163) మీర్జాగూడ వద్ద ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసిందే. ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వస్తున్న టిప్పర్ మితిమీరిన వేగంతో ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించగా పదుల సంఖ్యలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. కంకర ఓవర్‌లోడ్‌ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ యజమాని లక్ష్మణ్‌ టిప్పర్‌లోనే ఉన్నట్టు తెలుస్తోంది. లక్ష్మణ్ లడారం - శంకర్‌పల్లి వరకు టిప్పర్‌ను డ్రైవ్‌ చేసి.. ఆ తర్వాత శంకర్‌పల్లి నుంచి డ్రైవర్‌ ఆకాష్‌ టిప్పర్‌ నడిపినట్టు తేలింది. ప్రమాదంలో లక్ష్మణ్ కూడా గాయపడగా.. నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కండక్టర్ రాధ ఫిర్యాదుతో చేవెళ్ల పోలీసులు టిప్పర్ యజమానిపై కేసు నమోదు చేసారు.

Next Story