- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Begumpet Airport: బేగంపేట విమానాశ్రయంలో ప్రమాదం!.. సీఎం ఢిల్లీ టూర్ కు ముందు అనూహ్య ఘటన
రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కు ముందు బేగంపేట విమానాశ్రయంలో షాకింగ్ ఘటన జరిగింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బేగంపేట విమానాశ్రయంలో (BegumPet Airport) ప్రమాదం చోటు చేసుకుందనే విషయం కలకలం రేపుతున్నది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ల్యాండ్ అవుతున్న క్రమంలో ఓ ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ అదుపుతప్పి రన్ వే నుంచి (Aircraft runway slips) పక్కకు ఒరిగిపోయింది. ఎయిర్ క్రాఫ్ట్ ముందు చక్రం వంగిపోవడంతో రన్ వే ను చీల్చుకుంటూ కొంత దూరం ముందుకు వెళ్లింది. దీంతో రన్ వే దెబ్బతిన్నది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే ఎయిర్ పోర్టు సిబ్బంది స్పందించి అవసరమైన చర్యలు చేపట్టారు. పాడైన రన్ వే ను ప్రస్తుతం అధికారులు మరమ్మతులు చేస్తున్నారు. దీంతో బేగంపేట విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యంగా సాగుతున్నట్లు సమాచారం. అయితే మరి కాసేపట్లో ఈ విమానాశ్రయం నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. సీఎం టూర్ కు ముందు ఈ ప్రమాదం జరగడం కలకలం రేపింది. కాగా దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.






