- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ACB: అర్థరాత్రి దాటే వరకు ఉప్పల్ ఆర్టీఏలో ఏసీబీ సోదాలు.. యూపీఐ పేమెంట్లపై నజర్
ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో/ రామంతాపూర్: రాష్ట్రంలోని పలు ఆర్టీఏ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నిన్న ఏసీబీ (ACB) బృందాలు ఆకస్మికంగా తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా జిల్లాల్లో తనిఖీల్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడగా ఉప్పల్ రవాణా శాఖ కార్యాలయంలో తెల్లవారుజాము 1 గంట వరకు ఏసీబీ రెయిడ్స్ కొనసాగాయి. రంగారెడ్డి జిల్లా డీఎస్పీ ఆనంద్ నేతృత్వంలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. ఉప్పల్ రవాణా (Uppal RTA) శాఖలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం ఈ విషయంలో ఏసీబీ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. దీంతో నిన్న రంగంలోకి దిగిన అధికారులు అర్థరాత్రి దాటే వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దాదాపుగా పది మందికి పైగా రవాణా అధికారులు ఉద్యోగుల ఫోన్లను ఏసీబీ స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అధికారుల బ్యాంక్ ఖాతాలతో పాటు వారి యూపీఐ లావాదేవులను పరిశీలిస్తున్నారు. నిన్న పగలు జరిపిన తనిఖీల సందర్భంగా ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయంలో ఏడుగురు ఏజెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. తనిఖీలకు వచ్చిన అధికారులను చూసి గోడ దూకి పారిపోతున్న మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 6 వేలకు పైగా నగదు 20 రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారి డిజిటల్ ట్రాన్సాక్షన్ ను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు.
కాగా, నిన్న కామారెడ్డి జిల్లాలోని సలాబాద్ పూర్ ఆర్టీఏ చెక్ పోస్టు, పెద్దపల్లి, తిరుమల గిరి, ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయాల్లో జరిగిన తనిఖీల్లో లెక్కల్లో తేలని రూ. 1,81,030 నగదును గుర్తించి జప్తు చేయగా ఖమ్మం జిల్లా బూర్గంపాడు, వరంగల్ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిపిన తనిఖీల్లో రూ. 91 వేలు జప్తు చేశారు. తనిఖీల సమయానికి ఇంత మొత్తం లెక్కల్లో చూపని నగదు లభ్యం కాగా వీటికి సంబంధించి ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నారు.






