- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాల్లో ACB రెయిడ్స్.. కొనసాగుతోన్న సోదాలు
రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏసీబీ (ACB) అధికారులు వరుస దాడులతో ప్రభుత్వాధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పక్కగా ట్రాప్ చేసి ప్రజల నుంచి లంచాలు డిమాండ్ చేస్తున్న అక్రమార్కుల ఆట కట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ తెలంగాణ (Telangana) వ్యాప్తంగా పలు జిల్లాలోని ఆర్టీవో (RTO) కార్యాలయాలు, సరిహద్దుల్లోని చెక్‌పోస్టు (Checkposts)లపై ఏక కాలంలో దాడులు చేశారు. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలోని ఉప్పల్, తిరుమలగిరి, కామారెడ్డి (Kama Reddy), పెద్దపల్లి (Peddapally) జిల్లాల్లోని రోడ్డు రవాణా శాఖ కార్యాలయాలను కలుపుకుని ఏకంగా 18 ఆఫీసులపై ముకుకుమ్మడిగా అవినీతి నిరోధక శాఖ అధికారుల రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ మేరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు వారికి తొత్తులుగా మారిన ఆర్టీవో ఏజెంట్ల (RTO Agents)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఉప్పల్ (Uppal), తిరుమలగిరి ఆర్టీవో కార్యాలయాలపై ఏసీబీ అధికారుల మెరుపు దాడులు చేశారు. ఏకంగా కార్యాలయం గేట్ మూసివేసి తిరుమలగిరిలో 10, ఉప్పల్‌లోమరో 10 మంది ఆర్టీవో ఏజెంట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్టీవో కార్యాలయం పరిధిలో అప్పటి వరకు గుమిగూడిన ఏజెంట్లు అంతా.. అక్కడి నుంచి పరారయ్యారు. ఇక అయితే, డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవింగ్ టెస్ట్, వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వాహనదారులు ఆకస్మిక ఏసీబీ రెయిడ్స్ కారణంగా కార్యాలయం ఎదుట వారు కొన్ని గంటలుగా వేచిచూస్తున్నారు.






