- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో ఏసీబీ రెయిడ్స్ కలకలం.. అధికారుల అదుపులో ఇరిగేషన్ శాఖ ఎస్ఈ ఎన్ శ్రీధర్
తెలంగాణలో మరోసారి ఏసీబీ రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో మరోసారి ఏసీబీ (ACB) రెయిడ్స్ కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగం మేరకు ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లోని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ నూనె శ్రీధర్ (N.Sridhar) నివాసంతో పాటు కరీంనగర్, సిద్దిపేట ప్రాంతాల్లోని ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో మొత్తం 12 చోట్ల ఏక కాలంలో దాడులు కొనసాగుతున్నాయి. గతంలో శ్రీధర్ చాలాకాలం పాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని 6,7,8 ప్యాకేజీల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఆయన ఇరిగేషన్ శాఖ సీఏడీ డివిజన్-8 (CAD Division-8), చొప్పదండిలోని ఎస్సారెస్పీ (SRSP) క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే, ఎస్ఈ శ్రీధర్ భారీగా అక్రమాస్తులను కూడాబెట్టిట్లుగా ఆరోపణలు వెల్లువెత్తడంతో.. ఇవాళ తాజాగా ఆయన నివాసంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు చేసి కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెయిడ్స్‌కు సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ఓ వైపు కాళేశ్వరం కమిషన్ విచారణ తుది దశకు చేరుకున్న వేళ.. నీటి పారుదల శాఖలో.. అది కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పని చేసిన ఇంజినీర్ ఇంటితో పాటు బంధువుల ఇళ్లపై ఏసీబీ ఆకస్మికంగా రెయిడ్స్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.






