ఈఈ శ్రీధర్ను కస్టడీకి కోరుతూ ACB పిటిషన్.. సంచలన విషయాలు వెలుగులోకి

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 07:33:50  IST  )

నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నూనె శ్రీధర్‌ (N.Sridhar)ను ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్‌కు తరలించారు.

ఈఈ శ్రీధర్ను కస్టడీకి కోరుతూ ACB పిటిషన్.. సంచలన విషయాలు వెలుగులోకి
X

దిశ, వెబ్‌డెస్: నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ నూనె శ్రీధర్‌ (N.Sridhar)ను ఏసీబీ అధికారులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే అభియోగాల మేరకు ఆయనపై కేసు నమోదైంది. తాజా సమాచారం ప్రకారం రూ.150 కోట్లకు పైగానే శ్రీధర్ అక్రమంగా ఆస్తులను కూడబెట్టినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ప్రాంతాల్లో అత్యంత విలువైన ఆస్తులు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ఈఈ శ్రీధర్ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ.. ఏసీబీ అధికారులు కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని.. ప్రభుత్వ ప్రాజెక్టులలో నిందితుడు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డాడని, ఈ మేరకు వారం రోజుల పాటు శ్రీధర్ను విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరిన ఏసీబీ ఆ పిటిషన్‌లో పేర్కొంది.

ఈఎన్‌సీ అనిల్, శ్రీధర్‌ సంబంధాలపై ఆరా..

అక్రమాస్తుల కేసులో పట్టుబడిన కాళేశ్వరం ఈఈ శ్రీధర్ (Sridhar) వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, విచారణలో భాగంగా ఆస్తులు కూడబెట్టడంలో మరి కొంతమంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. అదేవిధంగా శ్రీధర్ అక్రమాలు, అవకతవకలు కాళేశ్వరం కమిషన్ చైర్మన్ రాహుల్ బొజ్జా (Kaleshwaram Commission Chairman Rahul Bojja) వరకు చేరాయి. దీంతో ఆయన జూన్ 27న ఇరిగేషన్ చీఫ్ ఆఫీసులో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కానీ, ఆ ఆదేశాలను శ్రీధర్ పెడచెవిన పెడుతూ.. ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బదిలీ అయిన తర్వాత కూడా ఏడాది పాటు చొప్పదండి (Choppadandi)లోనే ఈఈగా శ్రీధర్ విధులు నిర్వర్తించారు. అయితే, ఈఎన్సీ అనిల్ (ENC Anil) ఆదేశాలతోనే శ్రీధర్‌ అక్కడే విధుల్లో కొనసాగినట్లుగా ఏసీబీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈఎన్‌సీ అనిల్, శ్రీధర్‌ సంబంధాలపై కూడా నిశితంగా ఆరా తీస్తున్నారు.

Next Story