ఏసీబీ కస్టడికీ ఈఈ నూనే శ్రీధర్

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-19 15:32:25  IST  )

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

ఏసీబీ కస్టడికీ ఈఈ నూనే శ్రీధర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఇరిగేషన్ శాఖ ఎగ్జిగ్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనను కస్టడీకి కోరుతూ ఏసీబీ పిటిషన్ వేయగా 5 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న శ్రీధర్‌ను రేపు కస్టడీలోకి తీసుకుని ఐదు రోజుల పాటు విచారించనున్నారు. ఇదిలా ఉంటే నూనె శ్రీధర్‌కు సంబంధించిన ఇండ్లలో ఏసీబీ సోదాలు నిర్వహించిన సమయంలో భారీగా అక్రమాస్తులను గుర్తించారు. రూ.150 కోట్లకు పైనే శ్రీధర్ అక్రమాస్తులు కూడబెట్టినట్టు నిర్దారించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్ధిపేటలోనే విలువైన ఆస్తులు ఉన్నట్టు తేలింది. శ్రీధర్ కు సబంధించిన బ్యాంక్ లాకర్లలో ఉన్న బంగారు అభరణాలు, వివిధ ఆస్తులను గుర్తించడానికి విచారణ చెపట్టినట్లు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. కాలేశ్వరం ప్రాజెక్టులో శ్రీధర్ కీలకంగా వ్యవహరించడంతో ఆయన ఎలాంటి నిజాలు బయటపెడతారన్నది ఉత్కంఠగా మారింది.

Next Story