కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్‌కు ఏసీబీ యత్నం! Formula E-Car Race Case కేసులో మరో కీలక పరిణామం

by Ramesh Naini |   (  Updated:2025-06-16 13:34:45  IST  )

తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ- కారు రేసు కేసును ఏసీబీ అధికారులు స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది.

కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్‌కు ఏసీబీ యత్నం! Formula E-Car Race Case కేసులో మరో కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం రేపిన ఫార్ములా ఈ- కారు రేసు (Formula E Car Race Case) కేసును ఏసీబీ అధికారులు స్పీడప్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏ-1గా ఉన్న (KTR) కేటీఆర్‌ను ఇవాళ (సోమవారం) ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ సంధించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కేటీఆర్ సెల్ ఫోన్ సీజ్‌కు ఏసీబీ ప్రయత్నించినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే, తాను ఇవాళ సెల్‌ఫోన్ తీసుకురాలేదని కేటీఆర్ అధికారులకు సమాధానం చెప్పినట్లు తెలిసింది. ఫార్ములా ఈ- కారు రేసు సమయంలో 2021 - 24 మధ్య వాడిన సెల్ ఫోన్‌ను ఈ నెల 18లోపు సబ్మిట్ చేయాలని ఏసీబీ అధికారులు ఆదేశించినట్లు సమాచారం అందుతోంది. కేసుకు సంబంధించి మొబైల్ ఫోన్‌‌లలో ఎమైనా కీలక ఆధారాలు ఉండొచ్చనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ కేసుపై హైదరాబాద్‌లోని ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్‌ను ఇవాళ దాదాపు 7 గంటల పాటు విచారించారు. అనంతరం ఆయన వెంటనే తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ముమ్మాటికీ లొట్టపీసు కేసే అని విమర్శించారు. కేసు గురించి ఉదయం 10 గంటల నుంచి అడిగిందే అడుగుడు.. అటు తిప్పి ఇటు తిప్పి అడుగుతున్నారని తెలిపారు. ఫార్ములా ఈ రేస్ విషయంలో అవినీతి జరగలేదని స్పష్టం చేశారు. చిట్టి నాయుడు పంపిన ప్రశ్నలే అడుగుతున్నారని, వీళ్లకు పరిపాలన చేతకాదని తీవ్ర విమర్శలు గుప్పించారు. నాపై 14 కేసులు పెట్టావు.. ఇంకా 14 వేల కేసులు పెట్టుకో.. ఎవ్వడు భయపడడు.. అని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

Next Story