ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

by Malleboina Mahesh |

తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారణ హాజరయ్యారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్ పెట్టారు.

ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసు (Formula E car race case)లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విచారణ హాజరయ్యారు. ఈ విచారణ‌లో కేటీఆర్ ఉదయం నుంచి దాదాపు 7 గంటల పాటు 60 ప్రశ్నలను ఏసీబీ (ACB) సంధించినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోసారి పిలుస్తామని, విచారణకు అందుబాటులో ఉండాలని సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. విచారణ అనంతరం నేరుగా తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకున్న కేటీఆర్.. పార్టీ నేతలు, కార్యకర్తలతో ముచ్చటించిన తర్వాత సంచలన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విచారణలో అడిగిన ప్రశ్నలనే అటు, ఇటు తిప్పి అడిగారని అన్నారు. అలాగే తాను ఏసీబీ అధికారులను అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలనే పదే పదే అడిగారని, ఎటువంటి అవినీతి జరగలేదని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇది ఒక లొట్టపీసు కేసు అని, సీఎం ఓ లొట్టపీసు సీఎం అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం రేవంత్ (CM Revanth)కు తమను ఎలాగైన జైల్లో పెట్టాలని కక్షతో ఉన్నారని విమర్శించారు. తాము ఎటువంటి తప్పు చేయలేదని ఫార్ములా ఈ కార్ రేస్ మొదటి సంవత్సరం సక్సెస్ అయిందని, రెండో సంవత్సరం కూడా ఎట్టిపరిస్థితుల్లో వేదిక మారకుండా ఉండేందుకు ముందస్తుగా నిధులు విడుదల చేశామని ఈ సందర్భంగా కేటీఆర్ ఏసీబీ అధికారుల (ACB officials)కు చెప్పినట్లు మీడియాతో చెప్పుకొచ్చారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి కి తమను జైలుకు పంపడమో సంతోషం ఇస్తుందటంటే.. తెలంగాణ అభివృద్ధి కోసం మరో 10 కేసులు నాపై పెట్టిన బరిస్తానని, జైలుకు పంపిన సంతోషంగా వెళ్లి వస్తానని ఈ సందర్భంగా కేటీఆర్ స్పష్టం చేశారు. అతి త్వరలోనే లోకల్ బాడి ఎన్నికలు జరిగే ఉన్నాయని.. కాంగ్రెస్ పార్టీకి, నేతలకు ఎన్నికల్లో చుక్కలు చూపించాలని.. ఇదే బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తల ముందున్న లక్ష్యం అని కేటీఆర్ సూచించారు.

Next Story