- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అక్రమ ఆస్తుల కేసులో కాళేశ్వరం గజ్వేల్ ఈఎన్‌సీ అరెస్ట్..కళ్లు చెదిరేలా ఆస్తుల చిట్టా
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్ పై వచ్చిన అభియోగాలతో

దిశ, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఈఎన్సీ హరిరామ్ పై వచ్చిన అభియోగాలతో ఏసీబీ అధికారులు ఉదయం నుండి ఈఎన్సీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హరిరామ్ భూక్యాకు భారీగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించి ఆయను అరెస్ట్ చేసింది. ఆయన వద్ద నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. భూక్యా హరిరామ్ ఆస్తుల చిట్టా చూస్తే కళ్లు చెదిరిపోయేలా ఉండటంతో అధికారులే షాక్ అవుతున్నారు.
ఆయనకు షామీర్ పేట్‌లో విల్లా, కొండాపూర్‌లో విల్లా, శ్రీనగర్‌లో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో కమర్షియల్ స్పేస్, మర్కూక్ మండల్‌లో 28 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, హైదరాబాద్‌లోని శ్రీనగర్‌లో 2 ఇండిపెండెంట్ ఇళ్లు, బొమ్మలరామారంలో ఒక ఫామ్ హౌస్ ఆరు ఎకరాల మామిడితోట, కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు, కుత్బుల్లాపూర్‌లో ఓపెన్ ఫ్లాట్, మిర్యాలగూడలో ఓపెన్ ఫ్లాట్, ఒక బీఎంబ్ల్యూ రెండు కార్లు, బంగారు ఆభరణాలు, బ్యాంకులో జమ చేసిన నగదు ఉన్నట్టు గుర్తించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.






