- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Junior Colleges: తెలంగాణ జూనియర్ కళాశాలలో అకడమిక్ తనిఖీలు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలలో అకడమిక్ తనిఖీలు చేపట్టారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి (TGBIE) ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలలో అకడమిక్ తనిఖీలు చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని (Junior College) జూనియర్ కాలేజీల్లో తనిఖీలు నవంబర్ 1 నుంచి 15 వరకు జరుగనున్నాయని బోర్డు కార్యదర్శి తాజాగా కాలేజీల లిస్ట్ విడుదల చేశారు. ప్రత్యేక అధికారులతో పాటు డిప్యూటీ సెక్రటరీలు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తమ పరిధిలోని జూనియర్ కాలేజీలను సూచించిన షెడ్యూల్ ప్రకారం తనిఖీ చేయాలని ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా అధికారులు సంస్థ రికార్డులు, సిబ్బంది వివరాలు, విద్యార్థుల హాజరు తదితర అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీలు బోర్డు నిర్దేశించిన నిబంధనల ప్రకారం నడుస్తున్నాయో లేదో నిర్ధారించవలసి ఉంటుంది. కాలేజీ వివరాలన్నీ అకడమిక్ మాడ్యూల్‌లో నమోదు చేయాలని, 1987 ఫిబ్రవరి 5న జారీ చేసిన G.O.Ms.No.29 ప్రకారం విద్యా శాఖ నిబంధనలను పాటిస్తున్నారా..? అని పరిశీలించాలని సూచించారు. తనిఖీలు పూర్తయ్యాక సమగ్ర నివేదికను తక్షణమే కార్యాలయానికి పంపాలని, షెడ్యూల్‌కు అనుగుణంగా రిపోర్టులు సమర్పించాలని బోర్డు ఆదేశించింది.






