- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Group-1 పరీక్షలపై సీబీఐ ఎంక్వైరీకి ఏబీవీపీ డిమాండ్
గ్రూప్ -1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు నిచ్చెన నేపథ్యంలో (ABVP) ఏబీవీపీ స్పందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గ్రూప్ -1 (Group-1) మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) తీర్పు నిచ్చెన నేపథ్యంలో (ABVP) ఏబీవీపీ స్పందించింది. ఈ మేరకు మంగళవారం కేయూలో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తూ గౌరవ హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. రాజకీయ నాయకుల పునరావాస కేంద్రంగా టీజీపీఎస్సీ మారిందని, వాటాలు పంచుకోవడంలో నేతలు, అధికారులు బిజీ అయ్యారని ఆరోపించారు. ప్రభుత్వాలు మారితే టీఎస్పీఎస్సీ (TSPSC)పేరు టీజీపీఎస్సీ (TGPSC)గా మారింది తప్పితే బోర్డు తీరులో మార్పు రాలేదని అసహనం వ్యక్తం చేశారు. నిరుద్యోగులు, విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని మండిపడ్డారు. వెంటనే టీజీపీఎస్సీ బోర్డును రద్దు చేయాలని, గ్రూప్స్ పరీక్షల నిర్వహణ బాధ్యతను యూపీఎస్సీ (UPSC)కి అప్పగించాలని డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల పూర్తి ఎపిసోడ్ పై (CBI inquiry) సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఇందుకు తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.






