- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందూమత భావాలను దెబ్బతీసే ప్రయత్నాలను ఖండిస్తున్నాం: ఏబీవీపీ
by Ajay Maddhiboyina |
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నాటక ప్రదర్శన నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో నాటక ప్రదర్శన నేపథ్యంలో ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. థియేటర్ ఆర్ట్స్ విభాగం విద్యార్థులు ప్రదర్శించిన ఒక నాటకం హిందూ మత భావాలను కించపరిచేలా ఉందంటూ ఏబీవీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. హిందూ సంస్కృతిని, నాగరికతను అవమానించేలా నాటక ప్రదర్శన సాగిందని ఏబీవీపీ ఆరోపించింది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని, పైగా కొంతమంది అధ్యాపకుల అండతో కావాలనే రెండోసారి ప్రదర్శన ఇచ్చారని మండిపడింది. ఈ నాటకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ కార్యకర్తలపై ఎస్‌ఎఫ్‌ఐ,ఇతర వామపక్ష విద్యార్థులు దాడులకు తెగబడ్డారని ఏబీవీపీ హెచ్‌సీయూ యూనిట్ అధ్యక్షుడు అయుష్ సింగ్, కార్యదర్శి ఆంటోనీ బసుమతారీ ఆరోపించారు.
Next Story






