టెట్‌కు 1,26,085 దరఖాస్తులు.. ఈ నెల 29 వరకు గడువు

by Naga Rani Yarlagadda |

టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-2026) దరఖాస్తులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది.

టెట్‌కు 1,26,085 దరఖాస్తులు.. ఈ నెల 29 వరకు గడువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్-2026) దరఖాస్తులకు అభ్యర్థుల నుంచి భారీ స్పందన లభిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 1,26,085 దరఖాస్తులు అందినట్లు టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ తెలిపారు. టీజీటెట్-2026 దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. కాగా టెట్ పరీక్షలు జనవరి 3 నుండి 31 వరకు జరగనున్నాయి. సోమవారం సాయంత్రం వరకు అందిన ధరఖాస్తులు వివరాల ప్రకారం పేపర్1 కు 46,954, పేపర్2 కు 79,131 కాగా, మొత్తం1,26,085 దరఖాస్తులు అందినట్లు చైర్మన్ తెలిపారు. ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్లలో తప్పులను ఎడిట్ చేసుకునేందుకు నవంబర్ 25 నుండి డిసెంబర్ 1 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తుల సవరణ కోసం https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 7093708883, 7093708884, 7093958881, నంబర్లను సంప్రదించాలని సూచించారు.

Next Story