సోషల్ మీడియాలో ఫేమస్.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కోడలు ఇంత గొప్పపని చేస్తున్నారా?

by Ajay Maddhiboyina |

మాజీ మంత్రి దేవేందర గౌడ్ కోడలు సమత తూళ్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.

సోషల్ మీడియాలో ఫేమస్.. మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ కోడలు ఇంత గొప్పపని చేస్తున్నారా?
X

దిశ, వెబ్ డెస్క్: కొంతమంది రాజకీయాల్లో దశాబ్దాలపాటు కొనసాగితే మరికొందరు మధ్యలోనే రాజకీయాలకు దూరం అవుతుంటారు. అలా దూరం అయినప్పటికీ వాళ్లు చేసినపనులు, నడవడికలను బట్టి ఎప్పటికీ ప్రజలకు గుర్తుండిపోతారు. అలాంటి నాయకుల్లో తూళ్ల దేవేందర్ గౌడ్ ఒకరు. ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి వచ్చిన దేవేందర్ గౌడ్ అంచలంచెలుగా ఎదిగి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో టీడీపీలో కీలక నేతగా మారారు. తెలంగాణ ఉద్యమంలో సమయంలో నవతెలంగాణ పార్టీని స్థాపించగా తరవాత కాలంలో గట్టు పరిస్థితులు ఎదుర్కొన్నారు.

తిరిగి మళ్లీ టీడీపీలో చేరి రాజ్యసభకు వెళ్లినా ఆ తరవాత అనారోగ్య కారణాల వల్ల రాజకీయాలకు, ప్రజాసేవకు పూర్తిగా దూరం అయ్యారు. అయితే దేవేందర్ గౌడ్ రాజకీయాలను వదిలి ప్రజాసేవకు దూరం అయినా ఆయన కుమారుడు, కోడలు వైద్య వృత్తిలో కొన‌సాగుతూ ప్ర‌ముఖ డాక్టర్లుగా వెలిగిపోతున్నారు. దేవేంద‌ర్ గౌడ్ కు ముగ్గురు సంతానం కాగా వారిలో విన‌యేంద‌ర్ ఆదిత్యా హాస్పిట‌ల్స్ కు ఎండీగా ఉన్నారు. ఇక‌ ఆయ‌న స‌తీమ‌ణి అయితే చాలా మందికి తెలిసే ఉంటారు. ఆమె దేవేంద‌ర్ గౌడ్ కోడ‌లు అని తెలియ‌పోయి ఉండొచ్చు కానీ సోషల్ మీడియాలో చాలా ఫేమ‌స్.

సమత తూళ్ల గురించి..

ఆమె పేరే డాక్ట‌ర్ స‌మ‌త తూళ్ల‌. ఇన్ స్టాగ్రామ్‌లో ఈమెకు 2లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. డాక్టర్ సమత తరచూ ఆరోగ్యం గురించి వీడియోలు చేస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుండి పడుకునేవరకు ప్రతిఒక్కరూ ఎదుర్కొనే అనారోగ్య సమస్యలపైనే ఎక్కువ వీడియోలు చేస్తారు. ఉదయం అలసట ఎందుకు వస్తుంది, గట్ హెల్త్ ఎలా మెరుగు పర్చుకోవాలి, రోజుకు ఎంతసేపు పడుకోవాలి, ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఇలా ముఖ్యమైన అంశాలపైనే వీడియోలు చేస్తారు. విషయాన్ని సూటిగా వివరించడం, అనారోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారాలు సూచించడంతో ఈమె వీడియోలకు లక్షల్లో వ్యూవ్స్ వస్తుంటాయి. అయితే ఈమె దేవేందర్ గౌడ్ కోడలు అని ఇదివరకు చాలా మందికి తెలియదు.. కానీ కొందరు సోషల్ మీడియాలో ఈమె వీడియోలు షేర్ చేసి దేవేందర్ గౌడ్ కోడలు అంటూ పోస్టులు పెట్టడంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story