- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత.. మంత్రి దామోదర రియాక్షన్ ఇదే
రాష్ట్ర వ్యాప్తం ఆరోగ్యశ్రీ (Aarogya Sri) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తం ఆరోగ్యశ్రీ (Aarogya Sri) సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం నుంచి రావలసిన రూ.1,400 కోట్లకు పైగా బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లుగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. కాగా, ఈ హఠాత్పరిణామంతో రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు తమ బకాయిలను సర్కార్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Rajanarsimha) రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరోగ్యశ్రీ సేవలను యథాతథంగా కొనసాగించాలని ప్రైవేటు ఆసుపత్రులను కోరుతున్నామని అన్నారు. ఈ విషయంలో తామిచ్చిన స్వేచ్ఛను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఏనాడు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయని వారు ఇప్పుడు ఎందుకు వైద్య సేవలను ఆపుతున్నారో చెప్పాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రైవేటు ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ కింద నెలకు రూ.50 కోట్లు కూడా విడుదల కాలేదని గుర్తు చేశారు. తాను అధికారంలోకి వచ్చాక నెలకు రూ.100 కోట్లు ఇవ్వడానికి కమిట్‌మెంట్ ఇచ్చామని అన్నారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ సేవలో ఎలాంటి అంతరాయం కలగదని.. ప్రజలెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు.






