- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యశ్రీ బకాయిలు గత ప్రభుత్వ పుణ్యమే.. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో విపక్షాల ఆరోపణలపై అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆరోగ్యశ్రీ బకాయిల విషయంలో విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మండిపడ్డారు. ఇవాళ ఆయన అసెంబ్లీలో ఆరోగ్యశ్రీపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ బిల్లులను గ్రీన్ ఛానల్ (Green Channel) ద్వారా విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెప్పిందని, కానీ చెప్పిన విధంగా విడుదల కావడం లేదని ప్రశ్నించిన హరీశ్‌రావుకు ఆయన సమాధానం ఇచ్చారు.
త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి..
గత ప్రభుత్వం సుమారు రూ. 600 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టిందని విమర్శించారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ. 240 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 360 కోట్ల బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రతి నెలా సగటున రూ. 89 కోట్లు ఖర్చు చేస్తూ, మొత్తంగా రూ. 2,408 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలను క్లియర్ చేశామని అన్నారు. అందులో ప్రభుత్వ ఎయిడెడ్ ఆస్పత్రులకు రూ. 927 కోట్లు, ప్రైవేటు ఆస్పత్రులకు రూ. 1,480 కోట్లు చెల్లింపులు జరిగాయని వెల్లడించారు.
అయితే, ఆరోగ్యశ్రీ విషయంలో నిరుపేదలకు అన్యాయం జరుగుతోందంటూ అపోహలు కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) ఎలా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసని చురకలంటించారు. ఎవరి పీఏలు సీఎం రిలీఫ్ ఫండ్ సొమ్మును కాజేశారో కూడా తెలుసని, దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలోనే అన్నీ బయటకు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
రాష్ట్రానికి రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు.. దావోస్ పర్యటనపై సభలో మంత్రి శ్రీధర్ బాబు






