- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rajya Sabha: సీజేపీ ఆందోళనలపై రాజ్యసభలో గందరగోళం.. మధ్యాహ్నం వరకు సభ వాయిదా
కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) చేపట్టిన ‘చలో సంసద్’ నిరసన మార్చ్‌తో రాజ్యసభలో గందరగోళం నెలకొంది.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే రాజధాని ఢిల్లీ (Delhi)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ (NEET) ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అక్రమాలకు నిరసనగా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) చేపట్టిన ‘చలో సంసద్’ నిరసన మార్చ్ తీవ్ర ఘర్షణకు దారితీసింది. అయితే, వారు చేపట్టిన ర్యాలీకి పర్మీషన్ లేదని పోలీసులు అడ్డుకోవడంతో జంతర్ మంతర్ వద్ద భారీగా చేరుకున్న నిరసనకారులు, సీజేపీ మద్దతుదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ జరిపారు.
రాజ్యసభలో గందరగోళం..
అయితే, కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. సీజేపీ చేపట్టిన ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం బలగాలతో అణచివేయాలని చూస్తోందన్న ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. విద్యార్థుల పక్షాన సభలో నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, సీబీఎస్ఈలో తప్పిదాలపై తమను మాట్లాడేందుకు మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే, చైర్మన్ సీపీ రాధాకృష్ణ అందుకు అనుమతినివ్వకపోవడంతో ఇండియా కూటమి సభ్యులు రాజ్యసభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. స్పీకర్ వారించినా.. వినకపోవడంతో ఎట్టకేలకు సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు.






