AAP- KCR : కేసీఆర్ కుటుంబాన్ని భయపెడుతున్న ఆప్ ఓటమి !?

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-02-08 12:17:13  IST  )

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి(Aam Aadmi Party Defeat)తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని(KCR's Family Tension)న్ని భయపెడుతుంది.

AAP- KCR : కేసీఆర్ కుటుంబాన్ని భయపెడుతున్న ఆప్ ఓటమి !?
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక(Delhi Elections)ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి(Aam Aadmi Party Defeat)తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబాన్ని(KCR's Family Tension)న్ని భయపెడుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమికి మాజీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వ హయాంలో సాగిన లిక్కర్ స్కామ్(Liquor Scam), శీష్ మహాల్ వివాదం వంటివి చాల ప్రభావం చూపాయంటున్నారు విశ్లేషకులు. ఆప్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన అవినీతి ఆరోపణలను ఎదుర్కోనేందుకు ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ ఎన్నో ఆకర్షణీయ హామీలిచ్చానా...చివరకు యుమునా నదిలో బీజేపీ విషం కలిపిందని ప్రచారం చేసిన జనం మాత్రం ఆప్ ను గద్దె దించాల్సిందే అనుకుని ఎన్నికల్లో ఆ పార్టీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా తీర్పునిచ్చారు.

దీంతో 27ఏళ్ల తర్వాతా బీజేపీ ఢిల్లీలో మళ్లీ అధికారంలో వచ్చింది. ఆ వెంటనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయాన్ని సీజ్ చేయాలని..ఒక్క ఫైల్ కూడా బయటకు వెళ్లరాదంటూ ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఇక కేజ్రీవాల్ అవినీతి కేసులను, ఇంతకాలం ఆప్ ఢిల్లీ ప్రభుత్వం హయాంలో సాగిన అక్రమాల నిగ్గును తేల్చాలన్న బీజేపీ గట్టి వైఖరికి నిదర్శనంగా కనిపించింది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన విచారణలు వేగవంతం చేసి..అటు కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నాయకులను, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavita)ను మరోసారి జైలుకు పంపే ప్రయత్నం చేయవచ్చన్న ప్రచారం కేసీఆర్ కుటుంబంలో కలవరాన్ని రేపుతుందన్న కథనాలు వినిపిస్తున్నాయి.

ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న బీజేపీ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా తమకు పలు రాష్ట్రాల్లో సమస్యగా తయారైన ఆప్ పార్టీని, ఇటు తెలంగాణలో బీజేపీ అధికారానికి ప్రధాన అవరోధంగా ఉన్న బీఆర్ఎస్ ను చావు దెబ్బ తీసేందుకు లిక్కర్ కేసును మళ్లీ తెరపైకి తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణలో ఆప్, బీఆర్ఎస్ లను ముంచేసింది లిక్కర్ స్కామ్ అని బీజేపీ నేతలు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆప్, బీఆర్ఎస్ లను రాజకీయంగా అణిచివేసే అస్త్రంగా బీజేపీ వాడుకుంటుందనడంలో సందేహం లేదంటున్నారు.

ఇప్పటికే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహా పలువురు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ తెచ్చినట్లుగానే తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తామని చెప్పడం మరింత ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో తడబడుతున్న నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వంపై నెలకొనే వ్యతిరేకత బీఆర్ఎస్ కు అనుకూలంగా మారకుండా..లిక్కర్ స్కామ్ తో కేసీఆర్ ప్యామిలీని దెబ్బతీసి ప్రత్యా్మ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని బీజేపీ పావులు కదపడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Next Story