IAS vs MLA: మరో వివాదంలో సిరిసిల్ల కలెక్టర్.. స్టేజీ మీదే విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం

by Prasad Jukanti |   (  Updated:2025-09-17 11:46:20  IST  )

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పై సీఎంవోకు ఫిర్యాదు వెళ్లింది.

IAS vs MLA:  మరో వివాదంలో సిరిసిల్ల కలెక్టర్.. స్టేజీ మీదే  విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Sirisilla Collector) జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) తీరు మరోసారి వివాదాస్పదం అయింది. ప్రజాపాలన దినోత్సవ వేడుకలకు కలెక్టర్ ఆలస్యంగా రావడం చర్చనీయాశంగా మారింది. ప్రజాపాలన దినోత్సవానికి ప్రభుత్వం జిల్లాకు అతిథిగా పంపిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వేదికపైకి వచ్చినా కలెక్టర్ రాలేదు. దీంతో కలెక్టర్ లేకుండానే ఆది శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతం ఆలపిస్తుండగా చివరి దశలో కలెక్టర్ వేదికపైకి చేరుకున్నారు. ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకక పోవడం, జెండావిష్కరణకు ఆలస్యంగా రావడం పట్ల ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వతా వేదికపైకి వచ్చిన కలెక్టర్ కు ఆది శ్రీను తన చేతి గడియారం చూపిస్తూ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే చీఫ్ గెస్ట్ గా పంపిస్తే ప్రోటోకాల్ పాటించకపోవడంపై మండిపడ్డారు.

సీఎంవోకు చేరిన పంచాయితీ!:

కలెక్టర్ వరెస్స్ ఆదిశ్రీనివాస్ (Aadi Srinivas) ఇద్దరి పంచాయితీ సీఎంవోకు చేరింది. కలెక్టర్ తీరుపై ఆది శ్రీనివాస్ సీఎస్, సీఎంవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సీఎం ఓఎస్డీలు శేషాద్రి, శ్రీనివాస్ దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లడంతో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సీఎంవో అధికారుల సూచించినట్లు సమాచారం. గతంలో స్వాతంత్రదినోత్సవ వేడుకల సందర్భంలోనూ కలెక్టర్ ప్రోటోకాల్ పాటించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయిందని దీంతో ఉన్నతాధికారులు ఎలాంటి యాక్షన్ తీసుకోనున్నారు అనేది ఆసక్తిగా మారింది.

Next Story